Monday, April 6, 2020

ప్రకృతి సవాల్, రచన: డా. మున్నలూరి రామకృష్ణ

ప్రకృతి సవాల్...


డా. రామకృష్ణ మున్నలూరి
హాయ శాస్త్రవేత్త.. తె
లంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి

విశ్వాధినేతలం మేమంటే మేమని.. అఖండ శక్తి సంపన్నులము మేమంటే మేమని... సకల జగానికి దిక్సూచి మేమంటే మేమని..ఈ సమస్త చరాచర జీవులు నా కను సన్నల్లో.. అధుపాగ్నల్లో మెలగాలని...ఈ నేల నాది..ఆ కడలి నాది... పైనున్న నింగి నాది..ఆ పై ఉన్న అంతరిక్షం కూడా నాదే నాదే అంటూ... విశృంఖలంగా ప్రకృతి వనరులను ఒడిసి ఒడిసి పడుతూ... భావివ తారల పాటి.. గ్రహపాటు గా మారి... వారితో నాకేం పని అ న్నటూ..రేపు అన్నది ఒకటి లేదన్నట్టు...విశ్వం అనే రాజ్యం లొ అశ్వమేధ యాగమొనర్చి.. అప్రకటిత చక్రవర్తిగా విర్రవీగిన    మనిషి... ఎందుకో నేడు డీలా పడ్డాడు... ఒక సూక్ష్మ జీవి మరణ శంఖం పూరిస్తూ... విలయ తాండవం చేస్తూంటే..అతని సార్వభౌమత్వాన్ని వెక్కిరిస్తూ...వికట్టః హసం చేస్తూంటే.. విస్తు పోయాడు.. గమ్మునుండి పోయాడు... ప్రకృతిని మించిపోయానన్న బ్రమ ఒక్కసారిగా తొలగిపోయింది... మేరు శిఖరమంత అహం పటాపంచలైంది.. ఇప్పుడు మెలుకున్నాడు ..కాస్త స్థిమిత పడ్డాడు...చరిత్ర తెలిసిన అతనికి ఇది అంతం కాదని  తెలుసు..ఆ సూక్ష్మ జీవి వ్యాప్తి గుట్టు రాబట్టాడు... మందు కాస్త ఆలస్యం కావచ్చు ..అందాక ఏమిటని శోదించాడు.. కరోనా కి తనలాగే అహం కాస్త ఎక్కువని... దాని దగ్గర కి వెళ్తేనే అది సోకుతుందని ..ఇంటి పట్టునుంటే మన జోలికి రాదని కనిపెట్టాడు... స్వీయ నియంత్రణ ప్రస్తుతానికి శరణ్యమని... భౌతిక దూరం పాటిస్తూ..చేతులు తరచూ శుభ్ర పరుస్తూ.. మొహాన్ని.. ముక్కును..పరి పరి తడుమకుంటే చాలు... కరోనా మనకు ఆమడ దూరమని... గ్రహించాడు..చాటింపు వేయించాడు...ఇప్పుడు అందరికీ బోధపడింది.. జ్ఞానోదయమైంది... ఇప్పుడంతా ఇంటి పట్టునే ఉంటూ...ఆత్మీయులతో అనుబంధ గీతికలు అల్లుతూ... చిన్ననాటి జ్ఞాపకాలు..పెళ్లి నాటి ముచ్చట్లతో స్వాంతన చెందుతూ..పిల్లలతో పోటీ పడి అల్లరి చేస్తూ... వదిలేసిన కుంచె ను పట్టి రమ్యమైన భొమ్మలు వేస్తూ..గూడు లో బూజు పట్టిన పుస్తకాలు దుమ్ము దులిపి ఒక్కొక్కటిగా చదువుతూ...ఎక్కడో తెలియని భయం వెంటాడుతూనే ఉన్నా... ఇంక ఎన్నాళ్ళు ఇలా అని మది కలవర పెడ్తూఉన్నా ..గుండేకి ధైర్యం చెప్పుకొని...మనసంతా ఆశను నింపుకొని..ఈ భూమి పై కరోనా కి త్వరలో నూకలు చెల్లుతాయని వేచి చూస్తున్నాడు..అతని కోరిక త్వరలోనే తీరాలి...ఇప్పటికైనా మనిషి తీరు మారాలి...ప్రకృతి పై పెత్తనం మాని సహజీవనం చేయాలి..ఈ భూమి పై అందరూ చల్లగా ఉండాలి... లోక సమస్త సుఖినో భవంతు....           
రచన: డా రామ కృష్ణ మున్నాలూరీ..
సహాయ శాస్త్రవేత్త..
తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి...

మానవ జాతి ప్రయాణం..... రచన: డా. మున్నలూరి రామకృష్ణ



 మానవ జాతి ప్రయాణం...
మున్నలూరి రామకృష్ణ
సహాయ శాస్త్రవేత్త ..
తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి....

ఈ ధరణి పై మానవ జీవన ప్రయాణం.. నిరంతర సంఘర్షణ  భరితం..ఇది ఒక నిత్య కురుక్షేత్రం...గతించిన ఎన్నో ప్రళయాలు..ప్రకృతి వైపరిత్యాలు... వీటన్నింటినీ ఎదురొడ్డి నిలిచిన మానవ జాతి గమనం..ఒక అద్భుతం..చరిత్ర పుటలు ఒక్కసారి తిరగేస్తే..అడుగడునా మానవ జాతి తన ఉనికి కోసం చేసిందొక యుద్దం.. దశాబ్దాల పాటు వేదించిన కలరా కావచ్చు..మరణ మృదంగం మోగించిన మశూచి కావచ్చు..పరదేశి పాలన లో బక్కచిక్కిన దేశాలను మహా కరువు కాటేసినప్పుడు కావచ్చు... కుప్పలు తెప్పలుగా శవాలను పేర్చిన ప్లేగు కావచ్చు..కొన్ని మదమెక్కిన దేశాల అహం వెర్రి పుంతలు తొక్కి.. ప్రపంచ యుద్ధాలతో మరణ తాండవం చేసినప్పుడు కావచ్చు..దోమ కాటే పాము కాటై..ప్రాణాలు హరించిన మలేరియా కావచ్చు.. చంగు చంగుమని ఎగిరే ముక్కు పచ్చలారని పిల్లల కాళ్ళు చేతులు వంకర చేసి..వెక్కిరించి న పోలియో కావచ్చు..మొన్నటి ఎబోలా కావచ్చు.. నిన్నటి స్వైన్ ప్లూ కావచ్చు... ఇలా చెప్పుకుంటూ పోతే.. అడుగడునా ఉనికి కోసం మానవ జాతి చేసిందోక యుద్దం..గెలచి నిలిచిన వైనం ఒక అద్భుతం ..మరి ఈ సారి మనముందుకు వచ్చింది ఇంకొక మహమ్మారి.. అదే నేడు కంటికి కునుకు లేకుండా చేస్తున్న కరోనా..ప్రపంచమంతా హైరానా.. చూస్తున్న కొలది వేల ప్రాణాలు సమిదలవుతుంటే.. గొప్పలు పోయిన అగ్ర రాజ్యలే నిశ్చేష్టులై చూస్తుంటే... ఈ తరుణం మానవ జాతి కావాలి మరో సమరానికి సన్నద్ధం... చరిత్ర చూసిన అనేక యుద్ధాల్లో మంది బలం తో గెలిచిన సందర్భాలే ఎక్కువ.. కానీ కని విని ఎరుగని కరోనా ఉపద్రవం పై పోరు లో మాత్రం నీవు ఒంటరి సిపాయివే.. అలా అని నిరాశ పడవలసిన అవసరం లేదు...భౌతిక దూరం ... వ్యక్తిగత పరిశభ్రత.. స్వీయ నిర్భందం..ఇవే ప్రస్తుతానికి మనకు శరణ్యం...చేయి చేయి కలపొద్దు..నమస్కారం తో సరిపెట్టు... పరిష్కారం దొరికేవరకు ఓపిక పట్టు...చావును లెక్క చేయక మనకోసం పోరాడుతున్న వారికి జై కొట్టు... ఈనాడు కరోనాధి కావచ్చు... కాని రేపు మాత్రం ఖచ్చితంగా మనదే...శత్రువు మొండి వాడైనప్పుడు మనం జగమొండ్డిగా ఉండాలి.. రాత్రి కమ్ముకున్న చీకట్లు ఎంత భయంకరంగా ఉన్నా ఉదయించే సూర్యుని కిరణాల ధాటికి కరిగి కనుమరుగు అవ్వాల్సిందే...  మనోధైర్యమే మన ఆయుధంగా కదులదాం... చెదరని చిరు నవ్వుతో అలుపెరగని పోరాటం సాగిద్దాం..కరోనా అంతం తద్యం తథ్యం... ఆగదుగా ఈ మానవ జీవన ప్రయాణం...ఇది ఒక నిత్య కురుక్షేత్రం... ల
         
రచన: మున్నలూరీ రామ కష్ణ..
సహాయ శాస్త్రవేత్త ..
తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి....