Monday, April 6, 2020

మానవ జాతి ప్రయాణం..... రచన: డా. మున్నలూరి రామకృష్ణ



 మానవ జాతి ప్రయాణం...
మున్నలూరి రామకృష్ణ
సహాయ శాస్త్రవేత్త ..
తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి....

ఈ ధరణి పై మానవ జీవన ప్రయాణం.. నిరంతర సంఘర్షణ  భరితం..ఇది ఒక నిత్య కురుక్షేత్రం...గతించిన ఎన్నో ప్రళయాలు..ప్రకృతి వైపరిత్యాలు... వీటన్నింటినీ ఎదురొడ్డి నిలిచిన మానవ జాతి గమనం..ఒక అద్భుతం..చరిత్ర పుటలు ఒక్కసారి తిరగేస్తే..అడుగడునా మానవ జాతి తన ఉనికి కోసం చేసిందొక యుద్దం.. దశాబ్దాల పాటు వేదించిన కలరా కావచ్చు..మరణ మృదంగం మోగించిన మశూచి కావచ్చు..పరదేశి పాలన లో బక్కచిక్కిన దేశాలను మహా కరువు కాటేసినప్పుడు కావచ్చు... కుప్పలు తెప్పలుగా శవాలను పేర్చిన ప్లేగు కావచ్చు..కొన్ని మదమెక్కిన దేశాల అహం వెర్రి పుంతలు తొక్కి.. ప్రపంచ యుద్ధాలతో మరణ తాండవం చేసినప్పుడు కావచ్చు..దోమ కాటే పాము కాటై..ప్రాణాలు హరించిన మలేరియా కావచ్చు.. చంగు చంగుమని ఎగిరే ముక్కు పచ్చలారని పిల్లల కాళ్ళు చేతులు వంకర చేసి..వెక్కిరించి న పోలియో కావచ్చు..మొన్నటి ఎబోలా కావచ్చు.. నిన్నటి స్వైన్ ప్లూ కావచ్చు... ఇలా చెప్పుకుంటూ పోతే.. అడుగడునా ఉనికి కోసం మానవ జాతి చేసిందోక యుద్దం..గెలచి నిలిచిన వైనం ఒక అద్భుతం ..మరి ఈ సారి మనముందుకు వచ్చింది ఇంకొక మహమ్మారి.. అదే నేడు కంటికి కునుకు లేకుండా చేస్తున్న కరోనా..ప్రపంచమంతా హైరానా.. చూస్తున్న కొలది వేల ప్రాణాలు సమిదలవుతుంటే.. గొప్పలు పోయిన అగ్ర రాజ్యలే నిశ్చేష్టులై చూస్తుంటే... ఈ తరుణం మానవ జాతి కావాలి మరో సమరానికి సన్నద్ధం... చరిత్ర చూసిన అనేక యుద్ధాల్లో మంది బలం తో గెలిచిన సందర్భాలే ఎక్కువ.. కానీ కని విని ఎరుగని కరోనా ఉపద్రవం పై పోరు లో మాత్రం నీవు ఒంటరి సిపాయివే.. అలా అని నిరాశ పడవలసిన అవసరం లేదు...భౌతిక దూరం ... వ్యక్తిగత పరిశభ్రత.. స్వీయ నిర్భందం..ఇవే ప్రస్తుతానికి మనకు శరణ్యం...చేయి చేయి కలపొద్దు..నమస్కారం తో సరిపెట్టు... పరిష్కారం దొరికేవరకు ఓపిక పట్టు...చావును లెక్క చేయక మనకోసం పోరాడుతున్న వారికి జై కొట్టు... ఈనాడు కరోనాధి కావచ్చు... కాని రేపు మాత్రం ఖచ్చితంగా మనదే...శత్రువు మొండి వాడైనప్పుడు మనం జగమొండ్డిగా ఉండాలి.. రాత్రి కమ్ముకున్న చీకట్లు ఎంత భయంకరంగా ఉన్నా ఉదయించే సూర్యుని కిరణాల ధాటికి కరిగి కనుమరుగు అవ్వాల్సిందే...  మనోధైర్యమే మన ఆయుధంగా కదులదాం... చెదరని చిరు నవ్వుతో అలుపెరగని పోరాటం సాగిద్దాం..కరోనా అంతం తద్యం తథ్యం... ఆగదుగా ఈ మానవ జీవన ప్రయాణం...ఇది ఒక నిత్య కురుక్షేత్రం... ల
         
రచన: మున్నలూరీ రామ కష్ణ..
సహాయ శాస్త్రవేత్త ..
తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి....

3 comments: